GDWL: దేవబండ గ్రామంలో బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ అయిజ మండల బీజేపీ అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి వస్తే దేవబండకు శాశ్వత బ్రిడ్జి, ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటికి సమాధానం లేదన్నారు.