నిజామాబాద్: బాన్సువాడ ఎస్సీ బాలికల హాస్టల్లో సబ్ కలెక్టర్ కిరణ్మయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బంగారు సాయిలు, మాల మహానాడు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయ్, బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ నర్సింలు, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం ఉపాధ్యక్షుడు బంగారు మైసయ్య ఉన్నారు.