SGR: ఓ యువతి అదృశ్యమైన ఘటన జహీరాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. రంజోల్ గ్రామానికి చెందిన నర్సింగ్ యువతి (21) అక్టోబర్ 26 అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.