MDK: రేగోడ్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాచప్ప ఏఎస్ఐగా పదోన్నతి పొందాడు. మండలంలోని పలువురు నాయకులు శనివారం సన్మానించి, ఆయనకు శాలువా కప్పి స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గున్న సంగమేశ్వర్, నారాయణ మై పాల్, సంగమేశ్వర్, హనుమాన్లు, వెంకటేశం మోహన్ తదితరులు ఉన్నారు.