MDK: మాసాయిపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటిని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. మాసాయిపేటలో నిర్మించిన మొదటి ఇందిరమ్మ ఇల్లు పూర్తి కావడంతో ఆదివారం మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. గూడులేని నిరుపేదలకు ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజిరెడ్డి పేర్కొన్నారు.