KMM: పిల్లల పఠన సామర్థ్యం పెంపుకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం రెండవ దశ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, హెడ్మాస్టర్లతో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలుపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు అందించిన ఫీడ్ బ్యాక్ ప్రకారం కార్యచరణ సిద్ధం చేశామన్నారు.