ADB: మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 1049 సంఘాలకు గాను రూ.4,25,70,880 విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు.