MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట అనుబంధ తోటగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి కొలతలను సేకరించారు. సోమవారం వెంకటరావుపేట గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శైలజ ఆధ్వర్యంలో సిబ్బంది కొలతలను సేకరించారు. ఈజీఎస్ ద్వారా ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేస్తామని వారు తెలిపారు.