KMM: కూసుమంచి మండల కేంద్రంలోని, ఐకెపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారిని రామడుగు వాణి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు తగు సూచనలు చేశారు. దాన్యంలో మట్టి, తాలు లేకుండా తూర్పాలు పట్టాలని రైతులకు సూచించారు. సన్న రకాల ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లిస్తుందని తెలిపారు.