JN: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో నల్ల నర్సింహులు 32 వర్దంతి సభను మన ఆలోచన సాధన సమితి(మాస్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ రావు హాజరై మాట్లాడుతూ.. నల్ల నర్సింహులు ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు.