BHPL: రేగొండ మండల శివారులోని బుగులోని వేంకటేశ్వరస్వామి జాతర ఈ నెల 4వ తేదీన ప్రారంభం కానుంది. 4వ తేదీన మేళతాళాలతో స్వామివారిని కొండ మీదకు తీసుకెళ్తారు. 5న కళ్యాణం, ఏనుగు వాహనాలు, 6న అభిషేకం, వాహనాలు తిరుగుతాయి. 7న ప్రత్యేక పూజలు, 8న ముగింపు కార్యక్రమాలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై జాతరను విజయవంతం చేయాలని కోరారు.