HYD: TGSPDCL MD ముషారఫ్ అలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కరెంటు బిల్లుపై వినియోగదారుల మొబైల్ ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడి వంటి వివరాలను ముద్రించనున్నట్లు తెలిపారు. దీని వల్ల బిల్లులకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదులు, సేవల అప్డేట్స్ను వినియోగదారులకు వేగంగా చేరవేయడం సాధ్యమవుతుందని చెప్పారు. కాగా, ఇప్పటికే ఆఫీసర్ల నంబర్లు వస్తున్నాయి.