NGKL: అచ్చంపేట మండలంలోని జోగ్య తండాకు చెందిన సభావాత్ మేఘ్య (42) నోటిలో ఇడ్లీ ముక్క ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మేఘ్య, సాయంత్రం ఇడ్లీ తింటుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక వైద్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భార్య చిట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.