మేడ్చల్: మల్కాజిగిరి సైనిక్ పూరిలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎకో పార్క్ అందరికీ ఆహ్లాదం కలిగిస్తుంది. మరో వైపు ఇందులో ఓపెన్ జిమ్ సైతం ఉండటంతో, ఉదయం, సాయంత్రం వేళల్లో నగర ప్రజలు అక్కడికి వెళ్లి శారీరక ఆరోగ్యాన్ని పొందుతున్నారు. శరీరాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు నగరంలో ఇలాంటివి మరిన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.