SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. కంది మండలం కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు.