NGKL: నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన కుమ్మరి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఆయన ఏకంగా 700 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి పాటుపడతానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలిపి, విజయోత్సవాలు నిర్వహించారు.