KMR: రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం HPV వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు మండల వైద్యాధికారి డా.సురేష్ తెలిపారు. 14 సం.రాల వయసున్న బాలికలకు గర్భాశయ క్యాన్సర్ సోకకుండా అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించాలని పేర్కొన్నారు.