KMM: ఖమ్మం మున్సిపల్ కార్పొ రేషన్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన కొన్ని నిర్మాణాలకు కొందరు అధికారులు, సిబ్బంది కుమ్మక్కై అసెస్మెంట్ నంబర్లు కేటాయించినట్లు ఆరోపణలు రాగా, కొన్నాళ్ల క్రితం అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది.