BDK: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించాల్సిన కొత్త ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ కొత్త దశలోకి అడుగుపెట్టింది. గతంలో సుజాతనగర్ మండలంలోని గరీబ్‌పేట ప్రాంతాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పరిశీలించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ప్రతికూల నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దుమ్ముగూడెం అనువైన ప్రదేశంగా గుర్తించారు.