PDPL: హైకోర్ట్ న్యాయవాద దంపతులు గట్టు నాగమణి-వామన్ రావు దంపతుల హత్య కేసులో CBI అధికారులు గురువారం ఘటనా స్థలిని పరిశీలించారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామ శివారులో హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ముందుగా స్వస్థలం మంథని మండలం గుంజపడుగు గ్రామానికి వెళ్లి వామన్ రావు తండ్రితో మాట్లాడి వివరాలు సేకరించారు.