NRPT: 18 ఏళ్లు పైబడిన వారందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నారాయణపేట ఆర్టీసీ డిపోలో కార్మికులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ దానిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.