ASF: జిల్లాలో ఈ నెల 20 నుంచి ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్లో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావులతో కలిసి పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.