BHNG: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో వెంకట్రావు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.