KMR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డిలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి 110 దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.