MBNR: కల్లుగీతా సొసైటీలకు 25 శాతం వైన్స్ కేటాయించాలని సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ ట్యాంక్ బండి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గౌడ కులస్తులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 93 ప్రతులను చించేసి నిరసన వ్యక్తం చేశారు.