SRD: సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం మండల పూజా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రదీప్ తంత్రి పర్యవేక్షణలో తాంత్రిక పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొక్కొండ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి మామిళ్ళ గోపాల్ పాల్గొన్నారు.