NGKL: వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఈరోజు గ్రామసభ నిర్వహించారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లేబర్ బడ్జెట్ తయారీ గురించి చర్చించారు. చిన్న, సన్నకారు రైతులు తమ పొలాల్లో బీడు భూముల అభివృద్ధి పనులు, మట్టి రోడ్లు, వాలు కట్టలను చేసుకోవాలని అవగాహన కల్పించారు.