RR: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 122 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తమ సేవలు అందించినందుకు గాను పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించినప్పుడే పోలీసులకు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ భూపాల్ పాల్గొన్నారు.