NLG: ఈ నెల 25,26,27,28, తేదీలలో హైదరాబాద్ మహానగరంలో జరిగే ఐద్వా 14వ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్ధని పిలుపునిచ్చారు. సోమవారం వేములపల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఊరుకో బస్సు ఇంటికో మహిళా అనే నినాదాన్ని ఇచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆమె ఖండించారు.