MLG: ఇటీవల ఎస్సీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన మట్టేవాడ తిరుపతిని ఆదివారం బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చింతనీప్పుల బిక్షపతి ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, తిరుపతి నియామకం అందుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.