MDK: పాపన్నపేట మండలం పీ.హెచ్.సీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్‌ను పరిశీలించారు. సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృశ్య సారించాలన్నారు. హాస్పిటల్ కువచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని వైద్యులకు సూచించారు.