MLG: తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలను ఆదివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు, పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్, SP, అధికారులు ఉన్నారు.