ADB: నార్నూర్ మండల కేంద్రాన్ని సోమవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా సందర్శించనున్నారు. ఈ సందర్బంగా నీతి ఆయోగ్ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన గిరిజన సంగ్రహాలయం, లైబ్రరీని ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి RO ప్లాంట్ను సైతం ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.