ASF: జిల్లాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బతుకమ్మ పండుగ సంబరాల నిర్వహణపై అధికారులకు అయన పలు సూచనలు చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా చేయాలని సూచించారు.