NLG: నల్గొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుండి వివిధ పుణ్యక్షేత్రాలకు 65 బస్సులు నడపడం ద్వారా రూ. 32.59 లక్షల ఆదాయం సమకూరినట్లు నల్గొండ ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జూన్లో 22 బస్సులు నడపడం ద్వారా రూ. 11.95, జూలై లో 22 బస్సుల ద్వారా రూ. 13.00, ఆగస్టులో 18 బస్సుల ద్వారా రూ. 6.47, సెప్టెంబర్లో 3 బస్సుల ద్వారా రూ 1.16 లక్షల ఆదాయం వచ్చిందన్నారు.