SRPT: అనంతగిరి మండలం ఖానాపురంలో 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో చెత్తను బయట పడేయకుండా గ్రామపంచాయతీ ట్రాక్టర్లలో మాత్రమే వేయాలని సర్పంచ్ కంటు లాజర్ సూచించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని గ్రామస్థులకు తెలిపారు.