PDPL: గోదావరిఖని సింగరేణి సంస్థ భవిష్యత్ పరిరక్షణ కోసం కార్మిక వర్గం కలిసికట్టుగా ఉద్యమించాలని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖనిలో శనివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి అంశాలపై చర్చించేందుకు డిసెంబర్ 14న సోమాజిగూడ ప్రెసబ్లో కార్మిక సంఘాలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.