KMR: రాష్ట్రస్థాయిలో హైదరాబాదులో జరగనున్న క్రికెట్ పోటీలకు రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఆముదా మణికంఠ ఎంపికయ్యారు. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన అండర్ 14 విభాగం క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. ఈనెల 16 నుంచి హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అతడు పాల్గొననున్నాడు.