ADB: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామ సర్పంచ్ మగ్గిడి నర్సమ్మ, ఉప సర్పంచ్ జాదవ్ అజయ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా గెలిచిన నాయకులను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.