KMM: గూడూరుపాడు గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు యాలటూరీ నాగయ్య అనారోగ్య కారణాలతో ఇవాళ ఉదయం మృతి చెందారు. పార్టీ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ మృతదేహంపై ఎర్ర జెండా కప్పి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.