నిజామాబాద్: కాకతీయ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి కుటుంబ సభ్యులు బుధవారం బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఫ్లెక్సీ ద్వారా నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కాకతీయ విద్యాసంస్థల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జశ్విత్ రెడ్డి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తక్షణమే కాకతీయ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.