NLG: కనగల్ మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త కంబాల శివ లీలారెడ్డి బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డుకు ఎంపికయ్యారు. బింగి బాలరాజుగౌడ్ మెమోరియల్ వారు ఈ అవార్డును ఆగస్టు 23వ తేదీన హిమాయత్ నగర్లోని సరిగమ స్టూడియోలో అందించనున్నట్లు తెలిపారు. అవార్డుకు ఎంపికైన శివ లీలారెడ్డికి పలువురు అభినందనలు తెలియజేశారు.