సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సుధగోని లహరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు శారదా తెలిపారు. ఈ పోటీలు ఖమ్మం జిల్లా పినపాక మండలం బయ్యారంలో ఈనెల 8 నుంచి 10 వరకు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన లహరిని పలువురు అభినందించారు.