NRML: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భైంసా పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. సేవా సమితి అధ్యక్షుడు భీం సెన్ మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవ సేవ పరమావధిగా భావించి చలి కాలంలో నిరు పేదలైన సుమారు 50 మంది కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు.