NGKL: రేపు మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తాడూర్ మండలం గోవిందయపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఉత్సవ మూర్తుల అలంకరణ, అనంతరం పంచామృతాలతో స్వామి వారికి అభిషేకం, 9 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.