JGL: జగిత్యాల రూరల్ మండలంలోని అంబారీపేట్ గ్రామంలో అర్బన్ పార్క్‌ను మున్సిపల్ ఛైర్ పర్సన్ జ్యోతి, కలెక్టర్ సత్య ప్రసాద్‌లు శుక్రవారం ప్రారంభించారు. అలాగే పార్కులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్‌ను, క్లాక్ టవర్‌ను సైతం ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి, ఆర్డిఓ, స్థానిక MLA, నాయకులు తదితరులు పాల్గొన్నారు.