MNCL: జన్నారం మండలంలోని ఇందన్ పల్లి అటవీ రేంజ్లో ములుగు అటవీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పర్యటించారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శుక్రవారం ఇందన్ పల్లి రేంజ్ పరిధిలోని మైసమ్మకుంట, గనిశెట్టి కుంటలలో పర్యటించి పలు విషయాలు తెలుసుకున్నారు. అటవీ అధికారులు వన్యప్రాణులు, పక్షుల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్, ప్రొ. శాలిని ఉన్నారు.