RR: షాద్ నగర్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ మినీ స్టేడియం అత్యాధునిక నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ స్టేడియాన్ని రూ.2.75 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించబోతున్నామన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాల, కళాశాల దశలోనే క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.