మేడ్చల్: రామంతపూర్‌లోని ఏవ్ మారియా స్కూల్లో శనివారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పిల్లల నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మానవుడిలో ప్రేమ, క్షమాగుణం పెంపొందాలనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణీయం అన్నారు.