HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నిరుద్యోగ యువకుడు కాశీనాథ్ తన మద్దతుదారులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసి, వారి పరిస్థితిని దారుణంగా మార్చిందని ఆరోపించారు. చావడానికైనా సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కకుండా చేస్తామని పేర్కొన్నారు.